రోడ్డు భద్రతా నియమాలు పాటించండి - ప్రమాదాలు నివారించండి ...

పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు... నరసరావుపేట. రోడ్డు భద్రతా వారోత్సవాలు సందర్భంగా సోమ వారం పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అరుణ్ బాబు ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా అవగాహన,తీసుకొనవలసిన జాగ్రత్తల గురించి తెలిపిన ఎస్పీ కంచి శ్రీనివాసరావు జిల్లాలోని మండలాల వారిగా యాక్సిడెంట్ల నివారణకు చేపట్ట వలసిన పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గంజాయి నివారణకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. డీ- అడిక్షన్ సెంటర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ కంచి శ్రీనివాసరావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం రోడ్డు భద్రతా నియమాలను పాటించకపోవడం. నిర్లక్ష్యంగా వాహనాలను నడపడం, విశ్రాంతి లేకుండా ఎక్కువ దూరం వాహనం నడపడం, వ్యతిరేక దిశలో ప్రయాణించడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించక పోవడం, అతివేగం, యూ - టర్న్ తీసుకునేటప్పుడు చుట్టూ వున్న వాహనాలను గమనించక పోవడం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు గా ఆయన పేర్కొన్నారు. విద్యార్ధి దశ నుండే రోడ్డు భద్రతా నియమాలపై తప్పక అవగాహన కలిగి ఉండాలన్నారు.