నగల దుకాణం ప్రారంభోత్సవం కోసం వెళ్లి వరదల్లో చిక్కుకున్న సినీ నటుడు నాగర్జున

అనంతపురంలో కల్యాణి జువెల్లర్స్‌ను ప్రారంభించిన నాగార్జున పుట్టపర్తి విమానాశ్రయం నుంచి అనంతపురం వెళ్తుండగా వరదల్లో చిక్కుకున్న నటుడు అక్కడి నుంచి మరో మార్గంలో తరలించిన నిర్వాహకులు నాగార్జునను చూసేందుకు పోటెత్తిన అభిమానులు కల్యాణి జువెల్లర్స్ నగల దుకాణం ప్రారంభోత్సవం కోసం అనంతపురం బయలుదేరిన ప్రముఖ సినీ నటుడు నాగార్జున వరదల్లో చిక్కుకుపోయారు. ఉదయం విమానంలో పుట్టపర్తి చేరుకున్న నాగార్జున అక్కడి నుంచి అనంతపురం వెళ్తుండగా వరదలో చిక్కుకున్నారు. దీంతో నిర్వాహకులు ఆయనను మరో మార్గంలో అనంతపురం తరలించారు. ఆ తర్వాత నగల దుకాణాన్ని ప్రారంభించారు. నాగార్జునను చూసేందుకు వందలాదిమంది తరలివచ్చారు. శ్రీసత్యసాయి జిల్లాలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పండమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో దానికి అనుకుని అటూఇటూ ఉన్న కాలనీలు పూర్తిగా నీటమునిగాయి. వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండడంతో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. వరద ప్రభావం కారణంగా హైదరాబాద్-బెంగళూరు హైవేపై రాకపోకలు స్తంభించాయి.