వైఎస్ ఆస్తులు పంచారన్నది అవాస్తవము.

జగన్‌, షర్మిల పేరిట వైఎస్ కొన్ని ఆస్తులు పెట్టారని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి సతీయణి విజయలక్ష్మి తేల్చిచెప్పారు. ఇది ముమ్మాటికీ ఆస్తులు పంపకం కాదని అన్నారు. వైవీసుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి ఎన్నో అసత్యాలు చెప్పారని అన్నారు. వైఎస్ ఆస్తులు పంచారన్నది అవాస్తవమని విజయలక్ష్మి చెప్పారు.



అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి అభిమానులకు ఆయన సతీయణి విజయలక్ష్మి బహిరంగ లేఖ రాశారు. ‘‘ఇంటి గుట్టు వ్యాధి రట్టు.. తెరిచిన పుస్తకం’’ అని వైఎస్ అనేవారని గుర్తుచేశారు. తాను అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా.. జరగకూడనివి అన్ని నా ముందే జరిగిపోతున్నాయని అన్నారు. అబద్ధాల పరంపర కొనసాగుతుందని చెప్పారు. వైవీసుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి ఎన్నో అసత్యాలు చెప్పారని అన్నారు. వైఎస్ ఆస్తులు పంచారన్నది అవాస్తవమని చెప్పారు.