ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షుడుగా రత్నాకర్ నియామకం.

 


గుంటూరు 24అక్టోబర్ 2024(అక్షరకృష్ణ):ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ గుంటూరు జిల్లా అధ్యక్షునిగా ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు కనపర్తి రత్నాకర్ ఎంపికయ్యారు. ఫెడరేషన్ ఆధ్వర్యంలో గుంటూరు ఎస్.హెచ్. ఓ కార్యాలయం లో గురువారం జరిగిన జిల్లా ప్రత్యేక సమావేశం లో గుంటూరు జిల్లా ఫెడరేషన్ నూతన కమిటీ ఎంపిక జరిగింది. సమావేశానికి ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేసి జిల్లా లోని ఏడు నియోజక వర్గాల కమిటీలతో పాటు జిల్లా కమిటీని ప్రకటించారు. నూతన కార్యవర్గం లో ప్రధాన కార్యదర్శి గా పట్నాల సాయికుమార్, ఉపాధ్యక్షులు గా వేముల రాజేష్,గౌరవాధ్యక్షులు గా అజయ్ ఇండియన్, ఏం. శ్రీకాంత్, కార్యనిర్వహణ కార్యదర్శిగా వరదల మహేష్, కోశాధికారిగా కొండవీటి పుల్లారావు,కార్యదర్శులుగా పుట్ట పున్నయ్య, అచ్యుత సాంబశివరావు, అంబటి శ్యామ్ సాగర్, చింత మణి కుమార్, కార్యవర్గ సభ్యులు గా బుర్ర సుధీర్ కుమార్, ఎన్. జె. సామ్యూల్, డీ. కోటేశ్వరరావు, యు. కోటేశ్వరరావు లను ఎంపిక చేసారు. సమావేశం లో పాల్గొన్న ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు కొండ బాబు మాట్లాడుతూ ఫెడరేషన్ నూతన నాయకత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలన్నారు. నూతన అధ్యక్షునిగా ఎంపికైన రత్నాకర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కార సాధనలో నిరంతరం పోరాడుతామన్నారు.స మావేశం లో గుంటూరు తూర్పు, పశ్చిమ, పొన్నూరు, తెనాలి, తాడికొండ, మంగళగిరి, ప్రత్తిపాడు నియోజక వర్గాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.