ఊహించని విధంగా కొత్త కుర్రాడికి ఈ మ్యాచ్ లో చాన్స్ .

 

న్యూజిలాండ్ తో జరగనున్న చివరి టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా సన్నద్ధతను పెంచింది. ఊహించని విధంగా కొత్త కుర్రాడికి ఈ మ్యాచ్ లో చాన్స్ ఇవ్వనుంది.

ముంబై: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో చివరి మ్యాచ్ నవంబర్ 1 నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే కివీస్ చేతిలో రెండు మ్యాచ్ లు ఓడి టీమిండియా ఘోర పరాభవం మూటగట్టుకుంది. దీంతో ఇప్పుడు డ్యామేజ్ కంట్రోలింగ్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఈ మ్యాచ్ కు కొత్త కుర్రాడికి చాన్స్ ఇచ్చి చూస్తోంది. న్యూజిలాండ్ తో చివరి టెస్టుకు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ కీలక మ్యాచ్ కు ముందు ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రానాకు టీమిండియా నుంచి పిలుపు అందినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సిరీస్‌లో భారత్ 0-2 తో వెనుకంజలో ఉంది.