విద్యార్థునులకు సైకిళ్లను పంపిణీ చేసిన - రోటరీ క్లబ్ సభ్యులు

 

నరసరావుపేట 29 అక్టోబర్ (అక్షరకృష్ణ):పల్నాడు జిల్లా నరసరావుపేట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో, రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ నార్త్, వెల్జాన్ ప్రాజెక్ట్ సహకారంతో మంగళవారంపట్టణ,గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు సైకిళ్లు  పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కపిలవాయి రాజేంద్రప్రసాద్, ట్రెజరర్ కట్టమూరి ఆంజనేయులు, రోటరీ క్లబ్ పబ్లిక్ ఇమేజ్ డైరెక్టర్ ఎస్.కె. జిలాని మాలిక్, రోటరీ డైరెక్టర్లు పోటు అచ్యుత్, పులిపాటి రమేష్, రాచకొండ ప్రసాద్ దంపతులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలలో చదివే బాలికలు,దూర భారం వల్ల తమ చదువులను, మానుకో వద్దనే ఉద్దేశంతో 23 సైకిల్ లను షుమారు లక్ష పదిహేను వేల రూపాయలు విలువైన సైకిల్ లను పంపిణీ చేయడం జరిగిందని,స్కూల్ కి ఇంటికి మూడు కిలో మీటర్ల దూరం నుంచి వచ్చే కొంత మంది గ్రామీణ విద్యార్థునులకు కూడ ఈ సైకిళ్లు అందజేశామని తెలిపారు. అలాగే ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో కలిపి డిస్టిక్ 3150 వ్యాప్తంగా 37 క్లబ్ లకు మొదటి విడతగా 240 సైకిళ్లను అందజేయడం జరిగిందని, రెండో విడతగా త్వరలో 260 సైకిల్ లను ఇవ్వటం జరుగుతుందని, సైకిల్ పంపిణీ ప్రాజెక్ట్ విషయంలో  సహకరిస్తున్న వి. జనార్దన్ రావు, ప్రాజెక్టు కన్వీనర్ హరిహర ప్రసాద్ లకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.