ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో డీజీపీ ద్వారకా తిరుమలరావు

 రెండు రోజుల క్రితం సీఎం చంద్రబాబు, హోంమంత్రితోనూ డీజీపీ సమావేశమయ్యారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల నేపథ్యంలో ఇప్పటివరకు పోలీసు శాఖ తీసుకున్న చర్యలపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. సామాజిక మాద్యమాల్లో అనుచిత పోస్టులు, అసభ్యకర వీడియోలు పోస్టు చేస్తూ, అసత్య ప్రచారం చేస్తున్న ఘటనలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఇప్పటివరకు ఎంతమందిని అరెస్ట్ చేశారనే విషయాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అరాచకాలకు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహారిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో..

లైంగిక దాడుల నేపథ్యంలో ఇప్పటివరకు పోలీసు శాఖ తీసుకున్న చర్యలపై సమావేశం

పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..

తన సొంత నియోజకవర్గం పిఠాపురంలోని గొల్లప్రోలులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. అక్కడ ఫార్మా పరిశ్రమతో వ్యర్థాలు, పిల్లలపై లైంగికదాడుల గురించి ప్రస్తావిస్తూ శాంతి,భద్రతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏమాత్రం బాగోలేదని అభిప్రాయ పడ్డారు. క్రిమినల్స్‌కు కులం, మతం ఉండదని స్పష్టం చేశారు. లైంగికదాడికి తెగబడే వారికి కఠిన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇటీవల జరుగుతున్న ఘటనలకు హోం మంత్రి అనిత బాధ్యత వహించాలని కోరారు. సంబంధిత మంత్రులు బాధ్యతాయుతంగా మెలగాలని సూచించారు. చలనం లేకుండా ఉంటే క్రిమినల్స్ రెచ్చిపోతారని చెప్పుకొచ్చారు. పరిస్థితి ఇలానే ఉంటే నేనే హోం మంత్రి బాధ్యతలు తీసుకోవాల్సి వస్తోందని స్పష్టం చేశారు.