స్పెషల్ క్యాంపెయినింగ్ డే రోజున పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన తహసిల్దార్

 

సత్తెనపల్లిలో జరుగుతున్నటువంటి, క్రీడాకారులను అభినందించిన తహసీల్దార్.

సత్తెనపల్లి నవంబర్09 (అక్షర కృష్ణ):

ఎస్ఎస్ఆర్ -2025 లో భాగంగా ఎన్నికల కమిషన్ వారి ఆదేశం మేరకు,98- సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని సత్తెనపల్లి రూరల్ మండలం నందుగల 75 పోలింగ్ స్టేషన్లలో స్పెషల్ క్యాంపెయిన్ డే నిర్వహించడమైనది, సదరు క్యాంపెయిన్ డే లో ప్రతి బూత్ స్థాయి అధికారి వారి కేటాయించిన పోలింగ్ బూత్ ల వద్ద ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు అందుబాటులో ఉండి,ఫారం-6, 7,8 లను తీసుకుంటూ, ఓటరు జాబితాలో మరణించిన, వివాహమై వెళ్ళిపోయినా, వారి వివరాలను తొలగించుటకు,కొత్త ఓటర్లను నమోదు చేయుటకు, ఇప్పటికే నమోదు కాబడి ఉన్న ఓటర్ల వివరములలో తప్పులు,సరి చేయుటకు బిఎల్ఓ లు అందుబాటులో ఉన్నారు. సదరు స్పెషల్ క్యాంపెండే సందర్భంగా సత్తెనపల్లి ఏఈఆర్వో & తహశీల్దార్ కె.ఎస్.చక్రవర్తి నందిగామ,కంటిపూడి గ్రామాలలో సందర్శించి ఉన్నారు.సత్తెనపల్లిలో జరుగుతున్నటువంటి, క్రీడాకారులను అభినందించిన తహసీల్దార్.విశాఖపట్నం మరియు తూర్పు గోదావరి జిల్లాల మధ్య జరుగుతున్న మ్యాచ్ కి ముఖ్య అతిధిగా సత్తెనపల్లి మండల తహసీల్దారు చక్రవర్తి హాజరు అయ్యి క్రీడాకారులను పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు.క్రీడలు మంచి అనుభూతిని అందిస్తాయని, మనస్సుకు ఉల్లాసాన్ని, ఉత్సహన్ని ఇస్తాయి అని అన్నారు.